కరోనా సంక్షోభం: మహారాష్ట్ర కీలక నిర్ణయం

ముంబై: కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. కరోనా సంక్షోభంతో వ్యాపార లావాదేవీలన్నీ స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌ టారిఫ్‌లు తగ్గించనున్నట్లు తెలిపింది. వచ్చే ఐదేళ్ల పాటు అధిక చార్జీల నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొంది. వాణిజ్య రాజధాని అయిన ముంబైలో వినియోగదారులకు విద్యుత్‌ అందిస్తున్న ప్రైవేటు డిస్కంలు అయిన అదానీ ఎనర్జీ, టాటా పవర్‌కు 18-20 శాతం, వాణిజ్య అవసరాల నిమిత్తం వాడుకుంటున్న విద్యుత్‌కు 19-20 శాతం, ముంబైవాసులకు 10- 11 శాతం టారిఫ్‌లు తగ్గనున్నట్లు పేర్కొంది. (కరోనా షాక్ : భారత్, చైనాకు మినహాయింపు)